ఇండియా ఇంటర్ కాంటినెంటల్ కాల్త్చారాల్ సంస్థ ,చండీగడ్ మరియు తమిళ నాడు హిందీ సాహిత్య అకాడెమీ
చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 4 ,5 తేదీలలో జరిగే ఆరవ అంతర్జాతీయ సాహిత్యోత్చవం చెన్నై లోని స్టెల్ల
మేరీ కాలేజీ లో ౪ వ తేది ఉదయం ఘనంగా ప్రారంభమైంది. .వసుదైక కుటుంభం అనే నేపధ్య అంశంపై జరిగే ఈ సదస్సును
తమిళ నాడు గవర్నర్ గౌ.సుర్జిత్ సింగ్ బర్నాల ప్రారంభించవలసి వుండగా స్వల్ప అనారోగ్యం వల్ల వారు రాలేక పోవడంతో
అఖిలభారత హిందీ ప్రచార సభ అధ్యక్షులు ,పూర్వ రాజ్య సభ సభ్యులు డా.రత్నాకర్ పాండీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
పాలస్తీనా,. కొసొవ,పాకిస్తాన్,ఉజ్బెకిస్తాన్,ఇంగ్లాండ్ తదితర దేశాల రచయితల తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ,వివిధ భాషల నుండి వంద మంది
రచయితలు పాల్గొని పత్ర సమర్పణలు,కథ,కవిత పట్టనాలు చేసి వసుదైక కుటుంభం ,సాహిత్యం ద్వార ప్రపంచ శాంతి అంశాల్ని చర్చించారు...
.
ఈ సాహిత్యోత్చవం లో పాల్గొనేందుకు ప్రముఖ పంజాబీ రచయిత ,నిర్వాహకులు దేవ్ భరద్వాజ్ ,చండిగద్ నుండి పలువురు తెలుగు రచయితలు
ఆహ్వానం అందుకున్నారు.తెలుగు రచయితల సమన్వయ కర్త గా పెరుగు రామకృష్ణ(నెల్లూరు) ను నియమించారు.డా. అయినవరపు.రామలింగేశ్వర రావు
(శ్రీ హరి కోట),శ్రీకాంత్,ఖాజా మొఇనుద్దిన్ వల్లభాపురం .జనార్ధన్ (మహబూబ్నగర్),డా.కే.వి.రఘుపతి(యోగి వేమన విశ్వవిద్యాలయం,కడప),
ప్రొ.రామ చంద్రమౌళి (వరంగల్).అమరజ్యోతి (అనకాపల్లి).మైదవోలు వెంకట శేష సత్యనారాయణ (నెల్లూరు)పలమనేరు .బాలాజీ(చిత్తూర్)
ఎమ్మార్ వీ సత్యనారాయణ,(పెనుగొండ) ర్యాలి ప్రసాద్ (కాకినాడ),గోపీచంద్,నాగ సుశీల(గుంటూరు) ప్రత్యెక ఆహ్వాన రచయితలుగా హాజరయ్యారు.
ప్రారంభ సదస్సులో ముఖ్య అతిధి డా.రత్నాకర్ పాండే సాహిత్య కారులు సూక్ష్మ దృష్టి తో ఆలోచించాల్సిన సమయ మీదని,మూడువేల సంవస్చారాల
క్రితమే ఈ దేశంలో వసుదైక కుటుంబం జాడలు వున్నాయని ,ఇప్పుడు న్యూ క్లియర్ కుటుంబాలుగా విడిపోయి,మానవసంభందాలకు విఘ్హతం
కలిగి స్వార్ధ చింతన పెరిగి పోయిందని అన్నారు.సాహిత్యం ద్వారా విశ్వ శాంతిని ,సమైక్యతని నిలపాలని పిలుపునిచ్చారు.వీరు పలు పుస్తక ఆవిష్కరణలు చేసారు..
వాటిలో నెల్లూరు సత్యనారాయణ రచన "వ్హీల్స్ " ఆంగ్ల కవిత సంపుటి పలువురి దృష్టిని ఆకర్షించింది..ఇంగ్లీష్ కవిత్వంలో సామాజిక స్పృహ చొప్పించిన
కవిగా అందరి మన్ననలు అందుకొన్నారు..
రెండవ సదస్సుకి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి,రాష్ట్ర ప్రభుత్వ పురస్కార గ్రహీత పెరుగు రామకృష్ణ వినిపించిన హృదయ హారం కవితకి ఆంగ్లానువాదం
"గార్లాండ్ అఫ్ హేఅర్ట్స్",మరియు ప్రముఖ ఆంగ్ల కవి ,ఎడిటర్స్ చాయిస్ అవార్డు గ్రహీత మైదవోలు సత్యనారాయణ కవిత "సం హోప్" పలువురి ప్రసంశలు
అందుకుని అలరించాయి.అనంతరం పెరుగు రామకృష్ణ ,సత్యనారాయణ ఇతరు లను దేవ్ భరద్వాజ్ మరియు డా.మధు ధావన్ ప్రశంస పత్రాలతో సత్కరించారు..
పెరుగు.రామకృష్ణ
--